పోలాండ్ దేశంలో వైభవంగా నిర్వహించిన గణేష్ ఉత్సవాలు
పోలాండ్ దేశ రాజధాని వార్సా నగరం లో లిటిల్ ఇండియా గణేష్ బృందం నిర్వాహకులు కాట్రగడ్డ చందు, విజయ్, రెడ్డి రామసతీశ్ మరియు కందుల సరోజిని గార్ల ఆధ్వర్యంలో ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు మరింత వైభవంగా, ఆనందకరంగా నిర్వహించబడ్డాయి. విశేషంగా, మొట్టమొదటిసారిగా డోలు వాయిద్యాలతో గణపతి బప్పా విగ్రహ నిమజ్జనం జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరీ ముఖ్యంగా లడ్డు వేలంపాట లో లిటిల్ ఇండియా సంస్థ వారు లడ్డూ ప్రషాదం ని కైవసం చేసుకోవటం జరిగింది.
లడ్డూ వేలం పాట – రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు విరాళం
కాగా, ఈ లడ్డూ వేలం పాట లో వచ్చిన పూర్తి మొత్తం ఒక లక్ష 50 వేల రూపాయలు, మరియు దేవుని హుండీ, కానుకల రూపేణ వచ్చిన మొత్తం సుమారు 50,000 రూపాయిలు మొత్తం కలిపి 2 లక్షల రూపాయిలు పూర్తిగా ఇటీవల వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాల సిఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చుటకు నిశ్చయించడం జరిగింది . ఈ ఉత్సవాల్లో విద్యార్థులు, మహిళలు మరియు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను మరింత జయప్రదం చేశారు. అంతేకాక, పోలాండ్ దేశ ప్రజలు కూడా సంతోషభరితంగా ఈ కార్యక్రమం లో పాల్గొని భారత సాంప్రదాయాల్ని ఆదరించారు. ఈ ఉత్సవాలు భారతీయుల ఐక్యతను మాత్రమే కాకుండా, భిన్న సంస్కృతులను కలపడం ద్వారా సాంస్కృతిక సమైక్యతకు చిహ్నంగా నిలిచాయి.