తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ మూవీ టీం

18వ శతాబ్దంలో గోదావరి తీరంలో ఆకలితో ఉన్న ఎంతో మందికి అన్నదానం చేసి, అందరితో అమ్మ అని పిలిపించుకున్న డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించబడుతున్న చిత్రం ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. ఉషారాణి మూవీస్ పతాకంపై వల్లూరి రాంబాబు నిర్మాణ సారథ్యంలో, బాల నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని, ప్రపంచానికి డొక్కా సీతమ్మ గారి జీవితాన్ని, ఆమె అమ్మ మనసుని చూపించటానికి సిద్ధం అవుతోంది. ఇందులో ముఖ్య పాత్రల్లో మురళీమోహన్, ఆమని, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, శ్రీలు, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ అప్పారావు, ఆకెళ్ళ గోపాల కృష్ణ, బేబీ లాస్య, రమేష్, చినబాబు తదితరులు కనిపించనున్నారు.

దర్శకుడు బాల నారాయణ్ ముందుగా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, మనం బ్రతుతున్న ఈ తెలుగు నేల మీద చరిత్ర పెద్దగా చోటివ్వని ఎందరో మహానుభావులు నడిచారు. వారి గురించి మనం తెలుసుకుంటూనే పది మందికి తెలియజేయటం మన కనీస బాధ్యత అనే భావన నుంచి పుట్టిందే ఈ ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ చిత్ర నిర్మాణం. వెలుగు ఉన్నచోట చీకటి, జ్ఞానం ఉన్నచోట అజ్ఞానం, అమ్మ ఉన్నచోట ఆకలి ఉండలేవు. తన చుట్టూవున్న ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు అనుకున్న ఆ తల్లి జీవితాన్ని సినిమాగా మలిచే అవకాశం రావటం నా అదృష్టం, ఆ సీతమ్మ నాకిచ్చిన ఆశీర్వాదంగా భావిస్తూ, ఈ సినిమాను ఖర్చు విషయంలో కానీ, పాత్రల ఆహార్యం, అంగీకం ఇలా ఏ ఒక్కచోట రాజీపడకుండా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.

భారతీయ సినీ రంగంలో కొన్ని వందల సినిమాలకు నృత్యాలను అందించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీమతి సుచిత్ర చంద్రబోస్ ఈ సినిమాలో రెండు పాటలకు అద్భుతమైన నృత్య దర్శకత్వాన్ని అందిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ ఈ గీతాలను తెలుగు నేలపైన,తెలుగువారి గుండెల్లోనూ చిరస్థాయిగా నిలబెట్టే విధంగా చిత్రీకరణ చేస్తున్నామని తెలిపారు.
ఆర్ట్ డైరెక్టర్ మండు రవికుమార్ మాట్లాడుతూ మొదటి సారి దర్శకుడు బాల నారాయణ్ కథ చెప్తున్నప్పుడు 1840 నాటి కాలం తన కళ్ళ ముందు కనిపించిందని దానిని ఇప్పుడు రీ క్రియేట్ చెయ్యటం ఛాలెంజింగ్ గా అనిపించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పని చేస్తున్నట్లు తెలిపారు.
ఈ చిత్రానికి కథా మాటలను మురళీ – రమేష్ ద్వయం అందిస్తూ ఉండగా,
ఎడిటింగ్: శ్రీ కృష్ణ
మ్యూజిక్: కార్తీక్ కొడకండ్ల
కొరిగ్రాఫ్ : సూచిత్ర చంద్ర బోస్




















































