హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంటున్న “లోపలికి రా చెప్తా” మూవీ ‘మిషన్ కుట్టేటి సుందరి’ సాంగ్
మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్ణాని, సుస్మిత ఆనాల, సాంచి రాయ్ వంటి నటీనటులతో లక్ష్మీ గణేష్ మరియు వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హార్రర్ ఆధారిత కామెడీ ఎంటర్‌టైనర్ “లోపలికి రా చెప్తా”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రిక్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా, ఇటీవల “లోపలికి రా చెప్తా” సినిమాకి చెందిన ‘మిషన్ కుట్టేటి సుందరి’ పాట విడుదల చేయగా, దానికి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు అలరాజు అందించిన లిరిక్స్, డేవ్ జాండ్ కంపోజ్ చేసిన మాధుర్యమైన ట్యూన్ మరియు వెంకట రాజేంద్ర పాడిన దానికి ప్రేక్షకులు తెగ ఇష్టపడుతున్నారు. ఈ పాట విజయంతో తెలియజేసిన మూవీ టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. తమ “లోపలికి రా చెప్తా” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, త్వరలో మంచి తేదీని చూసుకుని గ్రాండ్ థియేట్రిక్ రిలీజ్‌కు తీసుకురావడమని దర్శక నిర్మాతలు తెలిపారు.
*నటీనటులు* – కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్ణాని, సుస్మిత ఆనాల, సాంచి రాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి, వాణి ఐడా మరియు ఇతరులు.
*టెక్నికల్ టీమ్*
సంగీతం: డేవ్ జాండ్
డీవోపీ: రేవంత్ లేవాక, అరవింద్ గణేష్
ఎడిటర్: వంశీ
ప్రొడ్యూసర్స్: లక్ష్మీ గణేష్ చేదెళ్ళ, కొండా వెంకట రాజేంద్ర
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా వెంకట రాజేంద్ర
ప్రెస్ RELATIONS: బి. వీరబాబు



















































