HomeFilm Newsటాలీవుడ్ లో ఏంటి కొత్త ట్రెండ్? అస్సలు ఎందుకు ఇలా?

టాలీవుడ్ లో ఏంటి కొత్త ట్రెండ్? అస్సలు ఎందుకు ఇలా?

టాలీవుడ్ లో అస్సలు ఎందుకు ఇలా? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏంటీ కొత్త ట్రెండ్. ఇది సినిమా ప్రమోషన్ కోసమా? లేక సినిమా మీద ఎనలేని నమ్మకమా? ఈ ట్రెండ్ చివరికి ఎక్కడికి దారి తీస్తుంది?

 

Chandrahass- Naga Vamsi- Kiran Abbavaram
Chandrahass- Naga Vamsi- Kiran Abbavaram

 

అసలు విషయానికొస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తుంది. అది ఎంతమంది సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోయిన్ల నోట వెంట విన్నాం. కానీ ఇప్పుడు అది ముందు వరుసలో ఉన్న ట్రెండింగ్ గా మారింది. కొందరు దాన్ని సినిమాకి ప్రమోషన్ గా వాడుతున్నారు అనుకుంటున్నారు కానీ మరి కొందరు సినిమా మీద నమ్మకంతోనే అలాంటి ఛాలెంజ్ లు చేస్తున్నారు అని అంటున్నారు. కానీ ఇందులో ఏది నిజం! ఏది అబద్దం! అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం మేటర్ లోకి వస్తే మొన్నటికి మొన్న బుల్లితెర నటుడు ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా చేసిన రామ్ నగర్ బన్నీ సినిమా ప్రమోషన్ లో ఒక ఛాలెంజ్ చేశారు అది “సినిమా నచ్చకపోతే మీ టికెట్ అమౌంట్ గూగుల్ పే చేస్తా” అని.

Chandrahass
Chandrahass

 

తదుపరి చాలెంజ్ విడుదలకు సిద్ధంగా ఉన్న లక్కీ భాస్కర్ గురించి ప్రొడ్యూసర్ నాగ వంశి గారు ఇలా అన్నారు “లక్కీ భాస్కర్ సినిమాలో ఎటువంటి తప్పిదాలు కనిపెట్టిన లేదా కనుగొన్న సరే వారిని పిలిచి, పార్టీ ఇచ్చి, వారితో సెల్ఫీ దిగుతానని” చాలెంజ్ చేశారు.

 

Naga Vamsi
Naga Vamsi

 

ఇదిలా ఉండగా ఈనెల దీపావళి సందర్భంగా అనగా 31న విడుదలకు సిద్ధం కానున్న కిరణబ్బవరం “క” మూవీ ప్రెస్ మీట్లో ఈ విధమైన ఛాలెంజ్ చేశారు “ఈ సినిమా కొత్తగా లేదు. ఈ సినిమాలో కనిపించిన పాయింట్ మునుపెన్నడూ ఎక్కడైనా కనిపిస్తే నేను సినిమాలు తీయడమే మానేస్తాను” అని ద్రుడమైన ఛాలెంజ్ చేశారు.

Kiran Abbavaram
Kiran Abbavaram

 

చివరికి తెలియాల్సి ఉంది ఇది సినిమా ప్రమోషన్ విషయంలో ఒక భాగమా? లేక వాళ్లపై, వాళ్ళ సినిమాపై, వాళ్ళ కథపై అపారమైన నమ్మకమా? అనేది.

ఏదేమైనా సరే ఈ ట్రెండ్ ఎక్కడి వరకు వెళ్తుందో! ఎక్కడితొ ఆగుతుందో! వేచి చూడాలి.

 

Chandrahass- Naga Vamsi- Kiran Abbavaram

About The Author

Pothuraju Chimuturi
Pothuraju Chimuturihttps://lokachitra.com
Pothuraju Chimuturi is a Loka Chitra web journalist from Krishna District, specialising in Telugu cinema coverage. With five years of experience in the film industry, he excels in delivering precise film reviews and accurate verdicts. His insightful analyses make him a trusted voice for cinema enthusiasts seeking reliable insights into Tollywood releases.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments