HomeFilm News'Laila' Blockbuster Guaranteed-Vishwaksen Should Raise Flag in Industry: Megastar Chiranjeevi

‘Laila’ Blockbuster Guaranteed-Vishwaksen Should Raise Flag in Industry: Megastar Chiranjeevi

‘లైలా’ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ-విశ్వక్సేన్ ఇండస్ట్రీలో జెండా పాతాలి: మెగాస్టార్ చిరంజీవి

WhatsApp Image 2025 02 09 at 9.35.25 PM

మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా మాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

మెగా మాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇలాంటి ఈవెంట్స్ కి రావడం వల్ల ఇక్కడున్న ఎనర్జీ నాకు ఎంతో ఉత్సాహం ఇస్తుంది. ఇంత ఎనర్జీ ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విశ్వక్ సేన్ ఫంక్షన్ కి వెళ్తున్నావా? అని అడిగారు. ఏం ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ.. అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులంటే వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా? మా ఇంట్లోనే మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రాన వాడి ఫంక్షన్ కి నేను వెళ్ళకూడదా? విశ్వక్ కి ఈ ప్రశ్న అడగడం నేను చూశాను. దానికి విశ్వక్ చాలా చక్కని సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదు అన్నాడు. నిజంగా తనని అభినందిస్తున్నాను. అభిమానులు వాల్ పోస్టర్లు చింపుకోవడం నేను చూశాను. నెల్లూరు లో మా కజిన్స్ ఒకరు రామరావు గారిని, ఒకరు ఏఎన్ఆర్ గారి అభిమానించి ఒకరిని ఒకరు కొట్టుకునేవారు. హీరోలు బాగానే వుంటారు. అభిమానులు కొట్టుకుంటున్నారనే ఆలోచన ఆ రోజు నుంచే నాకు మొదలైయింది. నేను ఫిల్మ్ యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య సక్యత సహ్రుద్బావ వాతావరణం ఏర్పాటు చేయాలని బలంగా కోరుకున్నాను. మద్రాస్ లో హనీ హౌస్ లో అందరం కలిసి పార్టీలు చేసుకునే వాళ్ళం. ఈ రోజుకి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున మేమంతా కలసికట్టుగా వుంటాం. బాలయ్య 50 ఇయర్స్ వేడుకకు నేను వెళ్లాను. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. అందరం కలివిడిగా వుండాలి. పుష్ప 2 పెద్ద హిట్ అయ్యింది. దానికి నేను గర్విస్తాను. ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే అందరం ఆనందం పడాలి. ఆ ఆనందం ఇవ్వడానికి ఈ వేడుకకు వచ్చాను. ఇండస్ట్రీ ఒకటే కాంపౌండ్. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో అనగారిపోయిన కోరిక గబుక్కున పెళ్ళుబికింది. లైలా గెటప్ లో విశ్వక్ కసక్ లా అనిపిస్తున్నాడు(నవ్వుతూ). విశ్వక్ నిజంగా ఆడపిల్ల అయివుంటే గుండెజారి గల్లంతయ్యేది(నవ్వుతూ). అంతగ్లామర్ గా వున్నాడు. నేను, నరేష్, రాజేంద్ర ప్రసాద్ లేడి గెటప్స్ వేశాం. ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. లైలా కూడా హిట్ గ్యారెంటీ. తప్పకుండ ఈ సినిమాకి ఆడియన్స్ వెళ్తారు. ఎంజాయ్ చేస్తారు. విశ్వక్ మాస్ క్లాస్ ఇటు అమ్మాయిగా అద్భుతంగా చేశాడు. దర్శకుడు రామ్ చాలా ఎంటర్ టైన్మెంట్ తో తీశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. విశ్వక్ చాలా ప్రతిభావంతుడు. తన ఇండస్ట్రీలో జెండా పాతాలి. ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో మగవాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంటాడు. అభిమన్యు సింగ్, పృద్వీ, ఆకాంక్ష, కామక్షి అందరూ చక్కగా పెర్ఫార్ చేశారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సాహు నిర్మాతగా ఇప్పుడే బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. సినిమా సమ్మర్ లో ప్రారంభం కాబోతోంది. ఇది ఆద్యంతం కామెడీగా వుంటుంది. ఎప్పుడు సెట్స్ లోకి వెళ్లి నటిస్తానా అనే ఉత్సాహం వుంది. సాహు, గోల్డ్ బాక్స్ కొణిదెల సుస్మిత కలసి ఈ సినిమాని నిర్మిస్తారు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ నమస్తే. జై హింద్’ అన్నారు.

WhatsApp Image 2025 02 09 at 9.35.25 PM

మాస్ కా దాస్ విశ్వక్సేన్ మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవినింగ్. చిరంజీవి గారు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఆయన కళ్ళలో ఒక ఆర్టిస్ట్ ఆనందంగా ఫీలవ్వడం కనిపించింది. అది నాకు ఫస్ట్ అవార్డ్, రివార్డ్. మా నాన్న చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. రాజకీయాల్లో ఆయన అనుచరునిగా వున్నప్పుడు మా కారు ఎవరో కాల్చేశారు. అది న్యూస్ గా వచ్చింది. మేము భయంలో వున్నాం. డాడీ ఫోన్ రింగ్ అయితే నేను లిఫ్ట్ చేశాను. హలో ఎవరు అంటే .. నేను చిరంజీవి అనే వాయిస్ వినిపించింది. వెంటనే డాడీకి ఫోన్ ఇచ్చాను. అప్పుడు అనిపించింది మా కారు కాలిపోవడం మంచి పని అయ్యిందని.(నవ్వుతూ) కారు కాలిపోయిందనే దిగులు మర్చిపోయి చిరంజీవి గారు కాల్ చేశారని సెలబ్రేట్ చేసుకున్నాం. అదొక మెమరబుల్ మూమెంట్. నా సినిమాకి ఆయన సపోర్ట్ చేయడానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కథ నా దగ్గరకి తీసుకొచ్చింది సాహు గారు. ఇది నా కెరీర్ లో స్పెషల్ మూవీ. ఈ కథకు న్యాయం చేశానని నమ్ముతున్నాను. రామ్ కథ చెప్పినప్పుడు నవ్వించాడు. నేను జనాల్ని నవ్వించాలని డిసైడ్ అయ్యాను. అనిల్ అన్నకి కంగ్రాట్స్. మెంటల్ హెల్త్ కి మించిన రిచ్ నెస్ మరొకటి లేదు. మెంటల్ పీస్ వున్నవాడు అందరికంటే ధనవంతుడు. ఎవరికీ హాణి చేయకపోడమే మనం చేసే పెద్ద హెల్ప్. సంక్రాంతికి అనిల్ అన్న అందరినీ నవ్వించే సినిమా చేశాడు. అన్నదానం ఎంత గొప్పదో మంచి వినోదం వున్న సినిమా తీయడం కూడా అంత గొప్పది. అదే ప్రయత్నం మేము లైలాతో చేశాం. ఫెబ్రవరి 14న అందరూ థియేటర్స్ కి వచ్చేయండి. సరదాగా ఎంజాయ్ చేయండి. లియోన్ జేమ్స్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. నిర్మాత సాహు గారికి అర్చన గారికి థాంక్ యూ. లవ్ యూ మెగాస్టార్ సర్. లైఫ్ లో గుర్తుండిపోయే రోజు ఇది’ అన్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. లైలా టీం కి నా బెస్ట్ విషెస్. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి సినిమా రిలీజ్ కాబోతుంది. అందరు వెళ్లి సినిమాని ఎంజాయ్ చేసి పెద్ద సక్సెస్ ఇవ్వాలి. విశ్వక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను లైలాగా మారిన వీడియో చూసినప్పుడు తన పడిన కష్టం కనిపించింది. ఒక హీరో హీరోయిన్ గా మారి ట్రై చేసిన చాలా సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అంత స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సాహు నా మిత్రుడు. మేము బాలయ్య బాబు గారితో సినిమా చేసాం. మళ్ళీ మా ఇద్దరం కలిసి చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నాం. చిరంజీవి గారు రీసెంట్ గా బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఇది మెమొరబుల్ జర్నీ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఒక జనరేషన్ ని శాసించిన గొప్ప స్టార్ చిరంజీవి గారు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్ కి కల. నాకు ఆ అవకాశం వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత చిరంజీవి గారితో చేయబోయే సినిమా కోసం చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాను’అన్నారు.

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి గ్రాండ్ వెల్కమ్. ఆయన మమ్మల్ని సపోర్ట్ చేయడానికి రావడం చాలా బలాన్ని ఇచ్చింది. అనిల్ రావిపూడి ని తన సినిమా ప్రమోషన్స్ ఆపేయమని అడుగుతున్నాను(నవ్వుతూ). చిరంజీవి గారు మా ఈవెంట్ కి వచ్చారు కాబట్టి ఇకపై మా ప్రమోషన్స్ కనిపిస్తాయి. విశ్వక్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇప్పుడున్న స్టార్స్ లో ఈ క్యారెక్టర్ చేయడానికి అంత డేరింగ్ ఎవరూ చేయరు. చాలా అద్భుతంగా ఈ క్యారెక్టర్ ని చేశాడు. తన మ్యాజిక్ ని బిగ్ స్క్రీన్ పై ఆడియన్స్ చూస్తారు. చాలా అద్భుతంగా కష్టపడి పని చేశారు. డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అది అద్భుతంగా స్క్రీన్ పైకి తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆడియన్స్ అందరూ తప్పకుండా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు’అన్నారు.

About The Author

Pothuraju Chimuturi
Pothuraju Chimuturihttps://lokachitra.com
Pothuraju Chimuturi is a Loka Chitra web journalist from Krishna District, specialising in Telugu cinema coverage. With five years of experience in the film industry, he excels in delivering precise film reviews and accurate verdicts. His insightful analyses make him a trusted voice for cinema enthusiasts seeking reliable insights into Tollywood releases.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments