మెగా స్టార్ ఫ్యాన్ ట్రైలర్ విడుదల: ప్రముఖ దర్శకులు ఏ. కోదండ రామిరెడ్డి చేతుల మీదుగా
హైదరాబాద్, బంజారాహిల్స్: అల్లు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అల్లు శ్రీరాములు నాయుడు గారి నిర్మాణంలో, కిరణ్ వారియర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మెగా స్టార్ ఫ్యాన్’ చిత్రం ట్రైలర్ ను ఈ నవంబర్ 29న ప్రముఖ దర్శకులు ఏ. కోదండ రామిరెడ్డి చేతుల మీదుగా ఘనంగా లాంచ్ చేశారు.
ఈ సినిమాలో పింగ్ పాంగ్ సూర్య, డార్లింగ్ ఫేమ్ నర్సింహా ముఖ్య పాత్రలు పోషించారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా కోదండ రామిరెడ్డి గారు మాట్లాడుతూ, “సినిమా ట్రైలర్ చాలా బాగుంది. మెగా అభిమానులు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని చెప్పారు.
కిరణ్ వారియర్ మాట్లాడుతూ, “ఈ రోజు ఈ ట్రైలర్ ని కోదండ రమి రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల అవ్వడం చాలా గర్వంగా ఉంది. ఒక మెగా అభిమానిగా ఈ సినిమా తీయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా ఆకర్షిస్తుందని విశ్వసిస్తున్నాను” అని పేర్కొన్నారు.
అల్లు శ్రీరాములు నాయుడు గారు మాట్లాడుతూ, “మా ట్రైలర్ ను దర్శకుడు కోదండరామి రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేయడం చాలా ఆనందకర విషయం. చిరంజీవి గారు మరియు కోదండ రామి రెడ్డి గారి కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. మా సినిమా కూడా ఈ నవంబర్ 29న విడుదల అవుతుంది. ప్రేక్షకులందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాము” అని తెలిపారు.
పింగ్ పాంగ్ సూర్య మాట్లాడుతూ, “ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది, అందరికీ నచ్చుతుంది అని బలంగా నమ్ముతున్నాను. ఈ ట్రైలర్ ను కోదండ రామి రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ నెల 29న ప్రేక్షకులందరూ థియేటర్ లో చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను” అని పేర్కొన్నారు.
దర్శకుడు: కిరణ్ వారియర్
నిర్మాత: అల్లు శ్రీరాములు నాయుడు
నటులు: డార్లింగ్ యు.వి నర్సింహ, పింగ్ పాంగ్ సూర్య
డిజిటల్ పి ఆర్: ఆర్ జే నరేష్, సునీల్ రెడ్డి
‘మెగా స్టార్ ఫ్యాన్’ చిత్రం ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవంబర్ 29న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసి ప్రేక్షకుల ఆదరణ పొందాలని చిత్ర బృందం కోరుకుంటోంది.



















































