Tuesday, June 25, 2024
HomeFilm Newsనిహారిక నిర్మాణం‌లో సాగుతున్న 'సాగు'

నిహారిక నిర్మాణం‌లో సాగుతున్న ‘సాగు’

‘సాగు’వంటి మంచి కాన్సెప్ట్ సినిమాలను అందరూ ప్రోత్సహించాలి: మెగా డాటర్ నిహారిక కొణిదెల

Saagu

వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలుగా సాగు అనే ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వినయ్ రత్నం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డా. యశస్వి వంగా నిర్మించారు. సాగు సినిమా కాన్సెప్ట్ నచ్చి మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని సమర్పించారు. ప్రేమ, వివక్ష తో నిండిపోయిన సమాజాన్ని ఎదురిస్తుంది, ఓడిస్తుంది. సాగు హరిబాబు మరియు సుబ్బలక్ష్మిల కథ .వాళ్లకున్న అడ్డులు తొలగించుకుని, వాళ్ళ ఆశలు, ఆశయాలు కోసం పోరాడి వాళ్లకున్న బీడు భూమికి నీళ్లు తెచ్చుకుంటారు. ప్రేమ ఎటువంటి క్లిష్టమైన సవాలులైన ఎదురుకుంటుంది అన్నదానికి నిదర్శనం ‘సాగు’.

అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ, టాటా స్కై బింగ్, ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్, ఎం.ఎక్స్ ప్లేయర్స్, హంగామా, జెసాన్, వ్యూయిడ్, యాక్ట్, నెట్ ప్లస్ బ్రాండ్, వి.ఐ, ఫైర్ టీవీ స్టిక్, ఎం.ఐ, ఎల్.జి, 1+ టవీ, క్లౌడ్ వాకర్, వాచో మాధ్యమాల్లో మార్చి 4 నుంచి ‘సాగు’ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు సాగు సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ….

నిహారిక మాట్లాడుతూ.. ‘సాగు అనే మూవీ నాకు ఎంతో ప్రత్యేకమైనది. లైఫ్‌లో మనకు చాలా ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కానీ హోప్ అనేది వదలకుండా ముందుకు వెళ్లాలని అనుకుంటాం. వ్యవసాయధారులకు ఎంతో హోప్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. నా జీవితంలో నాకు ప్రతీ విషయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోడున్నారు. 52 నిమిషాలున్న ఈ షార్ట్ ఫిల్మ్‌ని 4 రోజుల్లో షూట్ చేశారుచిత్రీకరించారు. ఇలాంటి యంగ్ టీంను సపోర్ట్ చేయడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఇంత మంచి ప్రాజెక్ట్ నా వద్దకు తీసుకొచ్చిన అంకిత్‌కు థాంక్స్. ఇలాంటి సబ్జెక్ట్ తీసినందుకు చాలా ఆనందంగా ఉంది. రైతుల కష్టాల్ని నేను ఎప్పుడూ దగ్గరుండి చూడలేదు. కానీ ఇలాంటి సినిమాను అందరికి ముందు తీసుకు రావడం ఆనందంగా ఉంది. సాగు సినిమాను నేను సమర్పిస్తున్నాను. ఇలాంటి మంచి ప్రాజెక్టులను నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌లను సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ఆదరించి ప్రోత్సహించాలి’ అని అన్నారు.

డైరెక్టర్ వినయ్ రత్నం మాట్లాడుతూ.. ‘మా సినిమాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మా చిత్రాన్ని చూసి మాకు సపోర్ట్ చేసిన నిహారిక గారికి థాంక్స్. రైతు గురించి చెప్పాలని సాగు తీశాను. ఓ మనిషిని కులం, డబ్బు, సమాజం వంటివి ఆపుతుంటాయి. సమస్య ఎలాంటిది అయినా కూడా ఆత్మహత్య పరిష్కారం కాదు అనే సందేశాన్ని ఇవ్వాలని తీశాను.’ అని అన్నారు.

నటుడు వంశీ మాట్లాడుతూ.. ‘సాగు అనేది మా అందరికీ ఎంతో ప్రత్యేకం. గత ఆరేడేళ్లుగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. నిహారిక గారి వల్లే మా సాగు సినిమా ఇక్కడి వరకు వచ్చింది. సాగు సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరం చాలా కష్టపడి ఈ చిత్రాన్ని చేశాం. మాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్’ అని అన్నారు.

హారిక బల్ల మాట్లాడుతూ.. ‘మా సినిమాకు ఇంత సపోర్ట్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా కోసం చాలా వర్క్ షాప్స్ చేశాం. స్లాంగ్ కోసం కష్టపడ్డాం. నాకు ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. ఇది వరకు చాలా పాత్రలు చేశాను. కానీ ఇంత మంచి గుర్తింపు అయితే రాలేదు. అందుకే ఈ సినిమాలో నటించాను’ అని అన్నారు.

నటీనటులు

వంశీ తుమ్మల – హరిబాబు

హారిక బల్ల – సుబ్బలక్ష్మి –
నాయుడు మొరం – రామారావు
బాలాజీ – రమేష్
అఖిలేష్ రేలంగి – రమేష్ కొడుకు
కళ్యాణ్ – రాము
రాజశేఖర్ – సూరిబాబు
శంకర్ రావు – వెంకటరావు
బాబూరావు(బాబాయ్) – కోటీశ్వరావు
నరసింహదాస్ – హరిదాసు
స్వర్ణ – రామారావు రెండొవభార్య-
శ్రీనివాస్ – మెడికల్ షాప్ రాజు
వేద శ్రీ – పాప

సాంకేతిక బృందం

రచయిత మరియు దర్శకుడు – వినయ్ రత్నం
నిర్మాత – డాక్టర్ యశస్వి వంగా
సమర్పణ: నిహారిక కొణిదెల
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – అక్షయ్ రామ్ పొడిశెట్టి
సంగీత దర్శకులు – సుహిత్ బంగేరా & ధని కురియన్
ఎడిటర్ & VFX – రాజేష్ బోనం
ఎగ్జిక్యూటివ్ నిర్మాత – షేక్ రజాక్
లైన్ ప్రొడ్యూసర్ – అఖిలేష్ రేలంగి
ప్రొడక్షన్ మేనేజర్ – శ్రావణ్ కుమార్
సౌండ్ డిజైన్ – సచిన్ సుధాకరన్ హరి హరన్ (sync cinema)
సౌండ్ మిక్స్ – అరవింద్ మీనన్
సింక్ సౌండ్ – వి స్వప్నిక్ రావు
బూమ్ ఆపరేటర్లు – కళ్యాణ్, హుస్సేన్
కాస్ట్యూమ్ డిజైనర్ – తేజస్విని
సహాయ దర్శకులు – నవ్య నగేష్, భవన్ దాస్
లిరిసిస్ట్ – ధనుష్ గుర్రాల, వినయ్
రత్నం, అజయ్ చంద్ బాషా
నేపథ్య గాయకులు – M G నరసింహ, అశ్విని చేపూరి
కలరిస్ట్ – రాజు రెడ్డి
అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ – వినయ అనంతు, ఈశ్వర్ కేత
సబ్ టైటిల్స్ – గాయత్రీ చాగంటి
పబ్లిసిటీ డిజైనర్ – రామ్‌చరణ్ సత్తిరాజు
పి.ఆర్.ఒ: బియాండ్ మీడియా (సురేంద్ర నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి)

 

 

Please follow and like us:
error2000
fb-share-icon15000
Tweet 3k
fb-share-icon20
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments